అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం మరియు ఒంగోలు నగర 150 వసంతాల వేడుకల సందర్భంగా ప్రతిష్టాత్మక విశిష్ట ప్రతిభా పురస్కారం అందుకున్న శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ ని విద్యాసంస్థల సిబ్బంది ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ హర్షిణి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ మహిళా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత , డైరెక్టర్ గోరంట్ల హర్షిత్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. శ్రీనివాసరావు ల తో పాటు బోధన, బోధనేతర సిబ్బంది గోరంట్ల రవికుమార్ ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా విద్యారంగంలో అధ్యాపకుడిగా, విద్యావేత్తగా కొనసాగుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న గోరంట్లరవికుమార్ఒం గోలు నగర అభివృద్ధితో పాటు విద్యారంగంలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తూ సమాజ అభ్యున్నతికి ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.విద్యారంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలు, ఒంగోలు నగర అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి అందించిన విశిష్ట ప్రతిభా పురస్కారం”ఆయన సేవలకు తగిన సముచిత గౌరవమని సిబ్బంది పేర్కొన్నారు.ఈ పురస్కారం గోరంట్ల రవికుమార్ కి మరింత ఉత్సాహాన్ని, స్ఫూర్తిని అందించి, భవిష్యత్తులో విద్యా మరియు సామాజిక రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రేరణగా నిలవాలని వారు ఆకాంక్షించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: