తాళ్లూరు: నేషనల్ అయోడిన్ డిఫెసియన్సీ డిజార్టర్స్ కంట్రోల్ పొగ్రాంలో మండలంలోతాళ్లూరు, తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ముమ్మ రంగా చేపట్టారు. తూర్పుగంగవరంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తూర్పుగంగవరం, నాగంబొట్లపాలెం పాఠశాలల్లో విద్యార్థులను పరిక్షించి నమూనాలు సేకరించారు. హెచ్ఐఓ చంద్రశేఖర్ బాబు, ఎఎన్ఎం అనిత, ఎంఎలాచ్పీ శ్రీలత, ప్రభావతతి, వంశీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
తాళ్లూరు పీహెచ్సీ పరధిలో వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజేష్ యాదవ్, హెచ్ఎన్ రవి, వైద్య సిబ్బంది పలు పాఠశాలల్లో విద్యార్థుల నమూనాలు సేకరించి ఆమోడిన్ ఉప్పు ప్రాముఖ్యతను వివరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: