తాళ్లూరు: వర్షాలు సంవృద్ధిగా కురిసి రాష్ట్రంలో, నియోజక వర్గంలో పచ్చని పంటలతో సస్యశ్యామలంగా వర్ధిల్లాలి అని దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గుంటి గంగా భవాని దేవస్థానంలో మంగళవారం వరుణ యాగం నిర్వహించారు.
వేదపండితులు శాస్త్రయుక్తంగా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొని గుంటి గంగా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞంలో పాల్గొన్నారు. ప్రకృతి మరింతగా కరుణించి సంవృద్ధిగా వర్షాలు కురువాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఈఓ నర్రా నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సానే నురేష్, జిల్లా నాయకుడు మానం రమేష్ బాబు, షేక్ పెద కాలేషా వలి (బడే), నాటక అకాడమి కార్పోరేషన్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, పిన్నిక రమేష్, వేణు, డానీ పాల్గొన్నారు. పూజారులు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాల రాజు, విజయలక్ష్మిలతో పాటు పలువురు పాల్గొని ప్రత్యేక హెూమం నిర్వహించి అతిథులకు దీవేనలు అందించారు.





Save or share this story as a newspaper-style Epaper Clip: