సేవా సేతు అభియాన్ క్యాంపు నిర్వహణ

తాళ్లూరు: రూఫ్ టాఫ్ సోలాప్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం మండల కాంప్లెక్స్ కార్యాలయం పరిధిలో తాళ్లూరు మండల విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సేవా సేతు అభియాన్ క్యాంపు నిర్వహించారు. దర్శి ఈఈ రామయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ……… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం నూర్యఘర్ – ముఫ్త్ బిబ్లీ యోజనలో బాగంగా సేవా సేతు అభియాన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికి సౌర విద్యుత్ ను చేరువ చేయటం, రూఫ్ టాఫ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లపై ప్రజలలో అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. వినియోగ దారులు తమ విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకోవచ్చని అన్నారు. అర్హలైన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రూ. 78వేల వరకు సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. కిలో వాట్కు రూ.30వేలు, 2 కిలో వాట్లకు రూ. 60వేలు, 3 కిలో వాట్లకు రూ. 78వేలు వరకు నబ్సిడీ వస్తుందని చెప్పారు. పధకంపై పూర్తి అవగాహన కలిగి ఉపయోగించుకోవాలని కోరారు. ఎడీఈ వెంకటేశ్వర్లు, ఎఈ రామక్రిష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *