ట్రాఫిక్ మరియు రోడ్ భద్రత పై అవగాహన పెంచు కోవాలి.రాష్ట్ర బిజెపి అధ్యక్షలు ఎన్ రామచందర్ రావు.

సికింద్రాబాద్ అక్టోబర్ 6(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినము మోదీ 25
సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం
బీజేపీ ఓబీసీ
మోర్చా మహంకాళి సికింద్రాబాద్ జిల్లా. అద్వర్యములో నిర్వహించడము చాలా సంతోషం అని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్. రాంచంధర్ రావు అన్నారు.సేవా సంకల్ప్అభియాన్‌లో భాగంగా మహంకాళి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మెట్టుగూడ మెట్రో స్టేషన్ సమీపంలోని స్కైలాబ్ హోటల్ వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహంకాళి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు వై. సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్. రామచందర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను బాధ్యతగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ఉపయోగించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించాలని, వేగ పరిమితులను పాటించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ఉపయోగించడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, అతివేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ఉల్లంఘించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పాదచారులు కూడా రోడ్డు దాటే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు
రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగానష్టపోతున్న నేపథ్యంలో ప్రమాదాలనివారణకు ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలుపాటించడం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదు.. మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడే సామాజిక బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో చిలకలగూడ ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ జగన్ రెడ్డి సిబ్బంది, బిజెపి మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబీసీ మోర్చా మహంకాళి జిల్లా ఇన్చార్జ్ మేకల సారంగపాణి బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకట రమణి , సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ T. రాజశేఖర్ రెడ్డి , మహంకాళిజిల్లా కార్యదర్శులు , శారదా మల్లేష్ , కె నాగేశ్వర్ రెడ్డి ఉపాధ్యక్షులు కె అరవింద్ హరి, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శులు ముఠా గణేష్, ముదుగుల సురేష్,ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు, రవీందర్ భానుమతి గారు సంధ్యా మేకల కీర్తి హర్ష కిరణ్ , ఆకుల సంపత్ కనకరాజు మహేందర్ సింగ్ చారి ఆకుల శ్రీనివాస్ బీజేపీ వివిధ మోర్చాల నాయకులు, శ్రీనివాస్ బంధం కిరణ్ కుమార్ మంజుల ఆదర్శ ముదిరాజ్ సతీష్ కుమార్ రాజేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు కార్యకర్తలు కార్యకర్తలు అందించిన సహకారాన్ని నిర్వాహకులు అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *