బేగంపేట అక్టోబర్ 6,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ )
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన 259వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 13 గ్రూపులకు చెందిన 348 మంది ద్వారా 196 దరఖాస్తులు అందాయి.వాటిలో రెవెన్యూ శాఖకు 67దరఖాస్తులు , బీసీ సంక్షేమ శాఖకు 24, మున్సిపల్ శాఖకు 26, ఇతర శాఖలకు 79 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి దరఖాస్తులు స్వీకరించిఎండార్స్మెంట్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు.
ఆర్టీసీ లో వివిధ కారణాలతో ఉద్యోగం కోల్పోయినకార్మికులు ప్రజావాణికి వచ్చి తమను విధుల్లోకి చేర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం ప్రజావాణి ఇంచార్జ్ గద్వాల్
విజయలక్ష్మిని కోరగా రవాణా శాఖ మంత్రి సహా ఆర్టీసీ ఎండీతో మాట్లాడి తగిన సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 317 మందికి ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయినకార్మికులకు తిరిగి విధుల్లోకి చేరే విధంగా చర్యలు తీసుకున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు.ఈ ప్రజావాణికార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: