బేగంపేట అక్టోబర్ 6,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
తల్లి తల్లిదండ్రులు కోల్పోయి పేదరికంలో ఉన్న విద్యార్థుల చదువుల కోసం తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ యువ నేత రాగ నాగరాజు గౌడ్ పాఠశాల ఫీజులు చెల్లించి తన ఉదారతను చాటుకున్నారు. తన అభిమాన నాయకుడు, మాజీ మంత్రి,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భాన్ని పరిష్కరించుకొని పేద విద్యార్థులకు సహాయం చేయాలన్న సంకల్పంతో వారికి సంవత్సరం ఫీజు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. ప్రకాశం నగర్ కస్తూరిబా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఆరు మంది విద్యార్థులకు సంవత్సరం ఫీజును చెక్కు రూపంలో చెల్లించారు.బీఆర్ఎస్ యువ నేత తలసాని సాయి కిరణ్ చేతుల మీదుగా చెక్కులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ తన తండ్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా పేద విద్యార్థులకు ఏడాది పాటు ఫీజు చెల్లించి వారి చదువులకు అండగా నిలిచిన రాగా నాగరాజు గౌడ్ ను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు.ఆపదలో ఉన్న పేదలను ఆడుకునేందుకు తనవంతు సహాయ సహకారాలు అందించేందుకు
ఎల్లప్పుడూ ముందుటానని నాగరాజు గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో బేగంపేట మాజీ కార్పొరేటర్ టీ.మహేశ్వరి శ్రీహరి, నాయకులు శ్రీహరి, నాని,శేఖర్,షేక్ ఆరిఫ్, మహమ్మద్ సిద్ధికి,లడ్డు యాదవ్, శరణ్,ఎల్లస్వామి, అస్గర్, అజూబా,అఫ్జల్,జావేద్,వాజిద్,వాహిద్,ఇర్ఫాన్,సల్మాన్,కాలిద్, విజయ్ ,అస్లాం,అమూల్, నాసిమా,సెజ్నాజ్,
శోభా, శారద,వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: