చెన్నై : అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్–2026కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు, తమిళనాడు ముఖ్యమంత్రి టి.ఎస్. జోసెఫ్ విజయ్ ని చెన్నైలోని ఆయన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు , విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ , అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి.ఎం.సి. హరీష్ బాలయోగి , మరియు విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ కె. మురళి కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి టి.ఎస్. జోసెఫ్ విజయ్ కి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
విజయవాడ ఉత్సవ్–2026కు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తమిళనాడు ముఖ్యమంత్రిని కోరినారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: