బేగంపేట అక్టోబర్ 8, (జేయస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయని మహాకాళి అమ్మవారి దసరా శరన్నవ రాత్రి ఉత్సవాలకు కుటుంబ సమేతంగా రావాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కు శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయ ఈవో వంగా అంబుజ ఆహ్వానించారు. గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఈవో, ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు ముందుగా ఆయనకు ఆహ్వాన పత్రికను అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. మంత్రిని కలిసి ఆహ్వానించిన వారిలో ఈవోతో పాటు వేద పండితులు వేణుమాధవ శర్మ ఎక్స్ అఫీషియో మెంబర్, అర్చకులు రామతీర్థశర్మ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు దేవి వరప్రసాద్ ఆలయ సిబ్బంది ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: