ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ), ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ సందర్శించారు. ముందుగా ఆసుపత్రిలోని క్యాజువాలిటీ (అత్యవసర విభాగం), క్యాథ్‌ల్యాబ్ (Cath Lab), ఎన్ఐసీయూ (NICU) విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్య విద్య, ఆసుపత్రి నిర్వహణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అవినీతిపై ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోందని, ఏ రూపంలో అవినీతి జరిగినా తీవ్రంగా పరిగణించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవినీతికి పాల్పడితే సస్పెన్షన్‌తో పాటు సంబంధిత ఉద్యోగుల సర్వీసు, భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని, కుటుంబ ప్రతిష్ఠ దిగజారుతుందని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లు వ్యాపార కేంద్రాలు కావని, ప్రజల ప్రాణాలను కాపాడే పవిత్ర సంస్థలని, ఉద్యోగులు నైతిక విలువలతో పనిచేయాలని పిలుపునిచ్చారు.జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. మాణిక్యరావు , జీఎంసీ ప్రిన్సిపాల్ డా. శ్రీవాణి , వైస్ ప్రిన్సిపాల్డా. మస్తాన్ భాషా , డిప్యూటీ సూపరింటెండెంట్ లు డా. కిరణ్ కుమార్ ,డా. తిరుపతిరెడ్డి , డా. ఏడుకొండలరావు , మరియు సంబంధిత విభాగాల ప్రొఫెసర్లు, వైద్యులు, పరిపాలనా సిబ్బంది పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: