నకిలీ వైమానిక దళ అధికారి అరెస్ట్: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులకు వల

బేగంపేట అక్టోబర్ 8(జే ఎస్ డి ఎమ్ న్యూస్ )
భారత వైమానిక దళ (ఎయిర్‌ఫోర్స్) అధికారి వేషధారణలో మిలటరీ ఏరియాలో చక్కర్లు కొడుతూ ఫొటోలు దిగుతున్న ఓ యువకుడిని అధికారులు గుర్తించి పోలీసులకు అప్పగించారు.
పోలీసుల కధనం మేరకు వివరాలిలా వున్నాయి. బిహార్‌కు చెందిన నితేశ్‌ కుమార్‌ పాల్‌ (22) నేరేడ్‌మెట్‌ ఆర్కేపురం బ్రిడ్జి సమీపంలో ఉంటూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం బేగంపేట పరేడ్ గ్రౌండ్స్‌లోని వీఎస్ఎస్ గ్రౌండ్ వద్ద ఫ్లయింగ్ లెఫ్టినెంట్ ర్యాంకు యూనిఫాం ధరించి అనుమానాస్పదంగా తిరుగుతూ ఫొటోలు దిగుతున్న అతడిని మిలటరీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు ఎయిర్‌ఫోర్స్ అధికారి కాదని, నకిలీ గుర్తింపుతో తిరుగుతున్నాడని తేలడంతో బేగంపేట పోలీసులకు అప్పగించారు.
తాను ఎయిర్‌ఫోర్స్ అధికారినంటూ సోషల్ మీడియా వేదికగా యువతులకు వల వేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టి యువతులను బురిడీ కొట్టించేందుకే పరేడ్ గ్రౌండ్‌లో ఫొటోలు దిగేందుకు వచ్చినట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడు ఎప్పటి నుంచి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాడు, ఎవరెవరిని మోసం చేశాడు అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *