కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిసిన ముఖ్యమంత్రి పర్యటన – జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు -ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధులు సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందికి అభినంధించిన జిల్లా ఎస్పీ

మీ భూమి – మీ హక్కు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా, జరుగుమల్లి మండలం, నర్సింగోలు గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి , జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, పటిష్ట బందోబస్తు విధులపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, వీఐపీ రూట్, రచ్చబండ, ప్రజావేదిక, పార్కింగ్ ప్రాంతాలను గుంటూరు రేంజ్ ఐజీ , జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు నిర్వహించేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి గారు హెలిప్యాడ్ నుంచి రచ్చబండ, ప్రజావేదిక కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొని పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సమన్వయంతో కూడిన విధులతో గౌరవ ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. బందోబస్తు నిర్వహణలో ప్రజావేదిక, రూట్, ట్రాఫిక్ విభాగాలతో పాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారన్నారు.

పటిష్టమైన ముందస్తు ప్రణాళిక, సమర్థవంతమైన విధుల నిర్వహణ, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటే ఎలాంటి కార్యక్రమాన్నైనా సజావుగా నిర్వహించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. బందోబస్తు విధులకు సహకరించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *