నాగులుప్పలపాడు అక్టోబర్ 9 సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న సయ్యద్ తౌషిక్ హత్య మరియు
వారితల్లి మౌలాభి ఆత్మ హత్యలకు కారణమైన పాఠశాల యాజమాన్యాన్ని శిక్షించాలని అదేవిధంగా ఆ పేద ముస్లిం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయంచేయాలని కోరుతూ ఈనెల అక్టోబర్ 12 వ తేదీన ఒంగోలు
కలెక్టరేట్ వద్ద జరిగే మహా ధర్నా విజయవంతం చేయాలని మాదిగరిజర్వేషన్ పోరాటసమితి మండల అధ్యక్షులు పసుమర్తి విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాగులుప్పలపాడు జామియా మసీదులో ముస్లింలను కలిసి ధర్నా కదిలి రావాలని కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ముస్లిం కుటుంబానికి న్యాయం జరిగేందుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేపట్టిన మహా ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాగులుప్పలపాడు మండలంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి,ఎం ఎస్ పి,, మాదిగ ఉద్యోగులు, మాదిగ విద్యార్థులు వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు మరియు ప్రజా సంఘాలు ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు బుల్ల డేవిడ్రాజు మాదిగ, తేజ మాదిగ, కత్తి నాగర్జున, నంబూరు భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: