పెద్ద దోర్నాల : దోర్నాల మండలం లోని వై చర్లపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు , బోధనపు రమణారెడ్డి మరో ముగ్గురు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు, వారు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ
సంవత్సరా తరబడి పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు లేదంటూ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడి రమణారెడ్డి బోధనపు రమణారెడ్డి మరియు మరో ముగ్గురు పార్టీ సభ్యత్వానికి,గ్రామ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు బట్టు.వెంకటేశ్వర రెడ్డి, జంగాల.రంగస్వామి, గుంటక.మల్లికార్జున్ రెడ్డి,బోధనపు శ్రీనివాస్ రెడ్డి లు రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు ఎంతో కృషి చేశాము .అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మండల నాయకులు,అవహేళన చేస్తూ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై,బాధతో తెలుగుదేశం పార్టీకి,పార్టీ సభ్యత్వానికి, తనకు అప్పగించిన వై.చెర్లోపల్లి గ్రామ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బోదనపు రమణారెడ్డి తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: