హైదరాబాద్ అక్టోబర్ 9(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
బతుకమ్మ పండుగ తెలంగాణసంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
శనివారం నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునేబతుకమ్మ పండుగమహిళల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆమె అన్నారు. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలనుభావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని, మహిళలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని గద్వాల విజయలక్ష్మి ఆకాంక్షించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: