బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో!
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో మాజీ జైలర్ దివ్య చౌదరి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. మహిళా ఖైదీలను నిబంధనలకు విరుద్ధంగా జైలు నుంచి బయటకు తీసుకెళ్లి, తన ఇంట్లో వ్యక్తిగత పనులు చేయించుకున్నారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.
ఈ కేసులో దాదాపు రెండు నెలలుగా పరారీలో ఉన్న దివ్య చౌదరిని సైబర్ సెల్ సహాయంతో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
ఒకప్పుడు జైలర్‌గా విధులు నిర్వహించిన జైలులోనే ఇప్పుడు ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి రావడం చర్చనీయాంశమైంది.
ఈ ఘటన జైళ్లలో అధికార దుర్వినియోగం, ఖైదీల హక్కులు, పర్యవేక్షణ వ్యవస్థపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆరోపణలపై తుది నిర్ణయం న్యాయస్థానంలో తేలాల్సి ఉంది.

Save or share this story as a newspaper-style Epaper Clip: