ప్రవాసి ప్రజావాణిని సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.

హైదరాబాద్ అక్టోబర్ 9(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
మహాత్మా జ్యోతి బా పూలే ప్రజాభవన్ లో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లు శుక్రవారం ప్రవాసి ప్రజావాణిని సందర్శించారు. సీఎం ప్రజావాణి అమలు జరుగుతున్న తీరును వారు పరిశీలించారు. ఈ సందర్బంగా జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ ఉక్రెయిన్ యుద్ధంలో 39 రోజుల క్రితం సెప్టెంబర్ 1న మృతి చెందగా, మృతదేహం తరలింపు కోసం, రూ. 6 లక్షలు చెల్లించాలని ఉక్రెయిన్ ఎంబసీ సూచించిననేపథ్యంలో సహాయం కోసం మృతుని భార్య భార్గవి, తల్లి గంగు, గ్రామ సర్పంచ్ బత్తుల గంగాధర్ తో కలిసి శుక్రవారం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. సీఎంఓఅధికారులతో మాట్లాడిఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో
సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్, ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, తదితరులు పాల్గొన్నారు.
సీఎం ప్రజావాణిలో 127 దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో శుక్రవారంనిర్వహించిన 260వ సీఎం ప్రజావాణికార్యక్రమంలో 16 గ్రూపుల ద్వారా 591 మంది ద్వారా 127 దరఖాస్తులు అందాయి.వాటిలో
రెవెన్యూ శాఖకు 47 దరఖాస్తులు , విద్యుత్ శాఖకు 15, హోం శాఖకు 14, ఇతర శాఖలకు 51 దరఖాస్తులు అందాయి. ఈ ప్రజావాణికార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *