దేవీ నవరాత్రులు శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతోఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి….. ఇన్స్పెక్టర్ సైదులు

బేగంపేట అక్టోబర్ 10,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
దేవీ నవరాత్రులు శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతోఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి అని బేగంపేట ఇన్స్పెక్టర్ సైదులు తెలియజేసారు.
మండపం ఏర్పాటుకు సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించి , ( ఎన్ ఓ సి) పొందాలి అన్నారు. విద్యుత్ శాఖ ( టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ )విద్యుత్ బోర్డు), ట్రాఫిక్ విభాగం, అగ్నిమాపక శాఖ (ఫైర్ ), మున్సిపల్/పంచాయతీ అధికారులకు సమాచారం తప్పనిసరి గా ఇవ్వాలన్నారు.అలాగే కమిటీ/ నిర్వాహక కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్ల వివరాలు స్థానిక పోలీసు స్టేషన్‌లో అందించి, రహదారుల కు ఆటంకం లేకుండా చూడాలన్నారు.ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లు,అంబులెన్స్/ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లే మార్గాలకు అడ్డంకి లేకుండా మండపం నిర్మించాలన్నారు.
వర్షం,ఈదురుగాలులు వచ్చినా
తట్టుకునేలా తాత్కాలిక షెడ్డును బలంగా ఏర్పాటు చేయాలనీ,దర్శనానికి వచ్చే భక్తుల
వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా నిర్వాహకులే సమీపంలో పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించాలన్నారు .మండపం వద్ద, విగ్రహం పరిసరాల్లో మరియు ప్రధాన ప్రవేశ/నిష్క్రమణ మార్గాల్లో 24 గంటలూ రికార్డయ్యేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, కమిటీ వాలంటీర్లు కనీసం 2 నుండి 3 మంది కాపలాగా ఉండాలనీ తెలియజేసారు.మహిళా భక్తులు అధికంగా వచ్చే సమయాల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని,ఈవ్-టీజింగ్ జరగకుండా వాలంటీర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100/112 పోలీసులకు సమాచారం ఇవ్వాలి.మండపం వద్ద సరిపడా ఇసుక బకెట్లు, నీటి డ్రమ్ములు మరియు అగ్నిమాపక సిలిండర్లు (Fire Extinguishers) అందుబాటులో ఉంచాలి. లైసెన్స్ పొందినఎలక్ట్రీషియన్ ద్వారా మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాలి.నాసిరకం వైర్లు, లూజ్ కనెక్షన్లు లేకుండా జాగ్రత్త వహించాలి. అఖండ దీపాలు, కర్పూర హారతులుమండపంలోని బట్టలు లేదా పందిరి వెదురు కర్రలకు దూరంగా సురక్షిత ప్రాంతంలో ఉండేలా చూడాలి. గౌరవ సుప్రీంకోర్టు వారి మార్గదర్శకాల ప్రకారం రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల వరకు ఎలాంటి లౌడ్ స్పీకర్లు, మైక్ సెట్లు వాడరాదు.నిర్దేశిత డెసిబుల్స్ పరిమితికి లోబడి బాక్స్ టైప్ స్పీకర్లను మాత్రమే వినియోగించాలి.
అలాగే నిబంధనలకు విరుద్ధంగా డీజేలు (DJs) వాడరాదని హెచ్చరించారు.
మండపం పరిసరాల్లో మద్యం సేవించడం, పేకాట ఆడటం లేదా చట్టవిరుద్ధకార్యకలాపాలకు పాల్పడటం నేరం అలాగే
నిమజ్జనం తేదీ, సమయం,ఉపయోగించే వాహనం మరియు ప్రయాణించే మార్గం (Route map) ముందే పోలీసులకు తెలియజేసి, కేటాయించిన చెరువులు/జలాశయాల వద్ద మాత్రమే నిమజ్జనం చేయాలి. నీటిలోకి దిగేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి; మద్యం మత్తులో ఉన్నవారిని వాహనాలు లేదా జలాశయాల వద్దకు అనుమతించరాదు. అత్యవసర పరిస్థితుల్లో: ఏదైనా అనుమానాస్పద వస్తువు లేదా అవాంఛనీయ సంఘటన ఎదురైతే తక్షణమే డయల్ 100 కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ SHO/బీట్ కానిస్టేబుల్‌కు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ సైదులు కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *