హైదరాబాద్ అక్టోబర్ 11,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోఆదివారం నిర్వహించిన శ్రీ పవర్ ఉమెన్ సేఫ్టీ బైక్ ర్యాలీలో మంత్రులు పొన్నం ప్రభాకర్,జూపల్లి కృష్ణారావు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ కుమార్తె మనశ్విని పాల్గొన్నారు.
మహిళల భద్రత, రక్షణ, ఆత్మవిశ్వాసం మరియు మహిళా సాధికారతపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో మనశ్విని కూడా పాల్గొన్నారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

Save or share this story as a newspaper-style Epaper Clip: