బేగంపేట అక్టోబర్ 11,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
దసరా శరన్నవరాత్రి వాళ్లలో భాగంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవాలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఈవో వంగ అంబుజా, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సురిటీ కామేశ్వర్ లు అమ్మవారికి పూజలు నిర్వహించారు.మొదటి రోజు ఆదివారం కూడా రావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాల వితరణ చేసారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఈ ఓ వంగా అంబుజా తెలియజేసారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: