ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు… మాజీమంత్రితలసాని శ్రీనివాస్ యాదవ్.

బేగంపేట అక్టోబర్ 11,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనిమాజీమంత్రితలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేసారు.
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పీజీ రోడ్డు లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రతి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలి అనడం సరైన పద్దతి కాదు అన్నారు.
అర్హులైన నూతన గ్రాడ్యుయేట్ లు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే విధానం రావాలన్నారు.
50, 60 సంవత్సరాల గ్రాడ్యుయేట్ లు కూడా ప్రతిసారి ఓటు నమోదు చేసుకోవాలా? అని తలసాని ప్రశించారు.
డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ఎంతోగౌరవిస్తున్నాయి.భారత ఎన్నికల కమిషన్ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తుందన్నారు.
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించారు.ఓట్లను తొలగించే అధికారం ఎవరిచ్చారు.దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయిన్నారు.న్యాయస్థానాలు కూడా ఎన్నికల కమిషన్ వైఖరిని తప్పుబట్టాయని గుర్తు చేసారు.
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.
నవంబర్ 6 తేదీ లోగా అర్హులైన గ్రాడ్యుయేట్ లు ఓటరుగా నమోదు చేసుకోవాలి అని తలసాని సూచించారు. ఈ కార్యక్రమంలో తలసాని వెంట టిఆర్ఎస్ నాయకులు శ్రీహరి, నాగరాజుగౌడ్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *