బేగంపేట అక్టోబర్ 11,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) ;
ప్రకాశం నగర్ రోడ్డుపైన ఉన్న అక్రమ పార్కింగ్
ను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.దసరా శరన్నవరాత్రుల వేళ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుంటారు.శ్రీ రామలింగేశ్వర దేవాలయం లోని శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అయితే కొందరు ఈ రోడ్డు పైన కార్లు ఇతర వాహనాలను పార్కింగ్ చేసి వెళుతున్నారని రోజుల తరబడి వాహనాలను అక్కడే పార్కింగ్ చేస్తుండటం ఆలయానికి వచ్చే భక్తులకు, స్థానికంగా నివాసం ఉండేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ట్రాఫిక్, పోలీస్ అధికారులు జోక్యం చేసుకుని వెంటనే ఆలయం వద్ద రోడ్డుపైన పార్కింగ్ చేసిన వాహనాలను వెంటనే తొలగించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: