బేగంపేట అక్టోబర్ 11,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
మద్యం మత్తులో వాహనాలు నడపడం వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు అని తిరుమలగిరి ట్రాఫిక్ ఏ సి పి జి. శంకర్ రాజు అన్నారు. గడచిన రెండు రోజులుగా
తిరుమలగిరి డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజుల్లో 105 కేసులు నమోదు చేశారు.బేగంపేట లో నిర్వహించిన
డ్రంక్ అండ్ డ్రైవ్ లో అంబులెన్స్ డ్రైవర్ దొరికి పోయాడు. ఈఎస్ఐ కు లీజుపై నడుస్తున్న నాచారం కు చెందిన అంబులెన్స్ డ్రైవర్ అనిల్ కు ట్రాఫిక్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో 46 ఎం జీ 100 ఎం ఎల్ బీ ఏ సీ లెవెల్ గా నమోదయింది.ఈ తనిఖీలలో ద్విచక్ర వాహనాలు 88 మూడు చక్రాల వాహనాలు మూడు నాలుగు చక్రాల వాహనాలు 14 మొత్తం 105 వాహనాలపై కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా ట్రాఫిక్
ఏ సీ పీ శంకర్ రాజు మాట్లాడుతూ తాగి వాహనం నడపడం అనేది ఒక్క తప్పుడు నిర్ణయం తో జీవితాంతం పశ్చాత్తాపం పడేలా చేస్తుందన్నారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు, తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్-I డిసిపి కె. రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనం నడపడం) తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలను తిరుమలగిరి ట్రాఫిక్ ఏ సీ పీ జీ. శంకర్ రాజు బేగంపేట పోలీస్ ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు, డి.ఆర్. ప్రమోద్ కుమార్, సర్దార్ నాయక్, ఐ.వి. రమణయ్య, జి. పవన్ కుమార్ రెడ్డి,జి. జానకి రాములు సిబ్బంది పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: