గాంధీ మెడికల్ కాలేజీలో ముగిసిన ఐవోఏ పీజీ టీచింగ్ ప్రోగ్రామ్–హాజరైన 300 మంది వివిధ రాష్ట్రల వైద్య విద్యార్థులు..

సికింద్రాబాద్ అక్టోబర్ 11 (జె ఎస్ డి ఎం న్యూస్ ) :
సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్ కాలేజీ ఆర్థోపెడిక్స్ విభాగం, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ (టోసా), ఇండియన్ ఆర్థోపెడిక్అసోసియేషన్ (ఐవోఏ)
సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల ‘ఐవోఏ పీజీ టీచింగ్ ప్రోగ్రామ్’ ఆదివారంముగిసింది. సదస్సుకుసంబందించిన వివరాలను సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ, గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ బచ్చు శ్రీనివాస్
వెల్లడించారు.
తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 300 మంది పీజీ వైద్య విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. త్వరలో పరీక్షలకు హాజరుకానున్న చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా, సుమారు 50 మందినిపుణులైన సీనియర్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో ఈ ఇంటెన్సివ్ క్లాసులు నిర్వహించారు. రోగులను ప్రత్యక్షంగా పరిశీలించి వ్యాధి నిర్ధారణ చేయడం, ఆధునిక చికిత్సా ప్రణాళికలు రూపొందించడం, ప్రాక్టికల్ పరీక్షల విధానం వంటి కీలక అంశాలపై ప్రముఖ వైద్య నిపుణులు విద్యార్థులకు సమగ్ర అవగాహనకల్పించారు.అకడమిక్ డీఎంఈడా.ఏ.రమాదేవి, కళాశాల
ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.ఉషారాణి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎంవీ రెడ్డి రచించిన పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. పీజీ వార్షిక పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు స్పష్టం చేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *