అమీర్ పేట అక్టోబర్ 11,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమీర్పేట శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఆదివారం శ్రీ స్వర్ణ కిరీటాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్య నిర్వహణ అధికారి వంగ అంబుజా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కే మల్లికార్జున అప్పల ఆధ్వర్యంలో పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో, వివిధ రకాలైన పూలతో సుందరంగా అలంకరించారు. 12వ తేదీ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా 13వ తేదీ శ్రీ గాయత్రీ దేవిగా 14వ తేదీ శ్రీ అన్నపూర్ణాదేవిగా 15వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా 16వ తేదీ శ్రీ సరస్వతి దేవిగా 17వ తేదీ శ్రీ మహాలక్ష్మి దేవిగా 18వ తేదీ శ్రీ దుర్గాదేవిగా 19వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా 20వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఈవో వంగ అంబుజా తెలియజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలియజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: