బేగంపేట అక్టోబర్ 11,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ )
ప్రకాశం నగర్ శ్రీ రామలింగేశ్వర దేవస్థాన ఆలయ ప్రాంగణంలోని శ్రీ భూ లక్ష్మి దేవీ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మొదటి రోజు ఆదివారం అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా కన్యా పూజా నిర్వహించారు. సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది.ఈ దర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివో చంద్రకళ, టెంపుల్ డోనర్ విశాల్ సుధాం ల ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చెసారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాల వితరణ చేశారు .


Save or share this story as a newspaper-style Epaper Clip: