క్షేత్ర స్థాయిలో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అంగన్ వాడీ సేవలు మరువలేనివని టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కోన్నారు. దర్శి టిడిపి కార్యాలయంలో ఐసీడీఎస్ మంజూరు చేసిన నూతన యూనిఫామ్స్ ను అంగన్ వాడీ కార్యకర్తలకు సోమవారం పంపిణీ చేసారు. ఆంగన్ వాడీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో గర్బిణీలకు, బాలింతలకు నిత్యం అందుబాటులో ఉండి పౌష్టికాహారం అందిస్తూ, ఆరోగ్య కార్యకర్తలతో పాటు ఆరోగ్య సూచనలు చేస్తూ తల్లి బిడ్డ లను సంరక్షిస్తున్నారని అన్నారు. వారు అంకిత భావంతో మరింత సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సీడీపీఓ పరిమళ క్షేత స్థాయిలో అందిస్తున్న పలు సేవల గురించి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి వివరించారు. ఎఎంసీ చైర్మన్ డీ ఎన్ సుబ్బా రావు, సూపర్వైజర్ అనునాధ, మాజీ చైర్మెన్ ఎన్ . పిచ్చయ్య , దర్శి పట్టణ అధ్యక్షుడు పుల్లల చెరువు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: