ప్రజా సమస్యలకు నాణ్యమైన, త్వరితగత పరిష్కారం అందించడమే ధ్యేయం – జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి….. ​ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 142 అర్జీలు

​ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనంలో గల పీజీఆర్‌ఎస్ (PGRS) హాల్‌ లో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి హాజరై, ప్రజల నుండి నేరుగా వినతులు మరియు ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన బాధితులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, జాయింట్ కలెక్టర్ గారు వారితో ఓపికగా మాట్లాడి సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వేదికలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 142 అర్జీలు నమోదయ్యాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
    ​ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి జాయింట్ కలెక్టర్  మాట్లాడూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీ పట్ల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు (SLA) లోపలే ప్రతీ సమస్యకు పరిష్కారం చూపాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేశారు. అర్జీలను కేవలం సాంకేతిక కారణాలతో తిరస్కరించడం సరికాదని, ప్రతి అర్జీ నీ క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా సమగ్రంగా విచారించి బాధితులకు పూర్తి స్థాయి సంతృప్తినిచ్చేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని  ఆమె ఆదేశించారు.

​ఒకే సమస్యపై ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదని, పునరావృతమయ్యే ఫిర్యాదులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉందన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, స్థానిక సంస్థలు మరియు ఇతర సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. పీజీఆర్‌ఎస్ పోర్టల్‌లో నమోదయ్యే ఫిర్యాదుల పురోగతిని తాను క్రమం తప్పకుండా సమీక్షిస్తానని, విధుల్లో అశ్రద్ధ వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్‌ఓ) ఆర్. శ్రీ వెంకటరమణ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారి మాధురి, బీసీ కార్పొరేషన్ ఈడి జి. వెంకటేశ్వరరావుల తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *