ఉస్మానియా కార్డియాలజీ విభాగం వెండర్లకు రూ. కోటి విడుదల.జూడాల సమ్మెతో దిగొచ్చిన అధికారులు.

సికింద్రాబాద్, అక్టోబర్ 13(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగం సామగ్రిసరఫరాదారుల (వెండర్ల) దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. జూనియర్‌ డాక్టర్ల (జూడా) సమ్మెతో పాటు విభాగాధిపతులు, వైద్యుల నిరంతర ఒత్తిడి నేపథ్యంలో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో భాగంగా కార్డియాలజీ వెండర్లకు తక్షణమే రూ. కోటి నిధులను విడుదల చేశారు.
ఈ నిర్ణయానికి సంబంధించి గత నెల మొదటి వారంలోనే రూ. 26 లక్షలు వెండర్ల ఖాతాల్లో జమ కాగా, తాజా నిధుల చెల్లింపుతో గుండె చికిత్సల సామగ్రి కొరతకు తాత్కాలిక ఊరట లభించినట్లయింది. డీఎంఈ కార్యాలయంలో అత్యవసరంగా నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో డీఎంఈతో పాటు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, కార్డియాలజీ హెచ్‌వోడీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. జూడాల సమ్మె తీవ్రతతో అత్యవసర సేవలు ప్రభావితం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రస్తుతానికి ఉస్మానియా కార్డియాలజీ విభాగానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి ఈ బకాయిలను క్లియర్ చేసింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *