పార్క్ ను అభివృద్ధి చేస్తా…..అందుబాటులో కి తీసుకొస్తా… సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్

బేగంపేట అక్టోబర్ 14,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
వీలైనంత త్వరగా పార్క్ ను అభివృద్ధి చేసి కాలనీ ప్రజలకు అందుబాటులో కి తీసుకొస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట జే లైన్ లో 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. నల్లగుట్ట పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడిన లైబ్రరీని అందుబాటులో కి తీసుకురానున్నట్లు చెప్పారు. అనంతరం స్థానికంగా ఉన్న సుభాష్ మైదాన్ పిచ్చి మొక్కలు, చెత్తతోనిండిపోయిందని, దానిని అభివృద్ధి చేయాలని స్థానికులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. స్పందించిన ఆయన వెంటనేఅధికారులతో కలిసి పార్క్ ను సందర్శించి పరిశీలించారు. వెంటనే పార్క్ లోని చెత్త చెదారాలను తొలగించాలని, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పచ్చదనం అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా స్థానికులు వాకింగ్ చేసే విధంగా ట్రాక్ లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కాలనీలోకి వచ్చే దారిలో తెల్లవారు జాము వరకు జ్యుస్ షాప్ ను తెరిచి ఉంచడం వలన కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాంగోపాల్ పేట CI తో ఫోన్ లో మాట్లాడి కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిపట్ల చర్యలుతీసుకోవాలని ఆదేశించారు. తమ సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో జీ హెచ్ ఎం సీ ఏ ఈ చంద్రశేఖర్, వాటర్ వర్క్స్ డీ జీ ఎం వెంకట్ రెడ్డి, ఎలెక్ట్రికల్ ఏ ఈ శివ రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, కోటేశ్వర్ గౌడ్, గణేష్, జనార్దన్, చంద్రప్రకాష్, కాలనీ వాసులు సత్యనారాయణ, మిట్టు, నరేష్, సురేష్, గంగరాజు, ఖదీర్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *