తాళ్లూరు : అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన తాళ్లూరు వెలుగు కార్యాలయంలో ఈరోజు వాలంటరీ టీచర్లుగా పనిచేసిన వారికి జిల్లా కలెక్టర్ వారిచే జారీ చేయబడిన ప్రశంసా ధ్రువపత్రాలను పంపిణీ చేయడం జరిగింది . ఏపీఎం దేవరాజు అధ్యక్షతన జరిగిన వివో ఏ ల సమావేశంలో సచివాలయాల వారీగా సర్టిఫికెట్లను వయోజన విద్య సూపర్వైజర్ వై. చౌడి రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత అక్షరాంధ్ర కార్యక్రమంలో పని చేసిన వాలంటీర్లకు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం అమలవుతున్న విడతలోనూ రెట్టించిన స్ఫూర్తితో.. ఉత్సాహంతో పని చేయాలని కోరారు. కార్యక్రమంలో సిసి కోటేష్ బాబు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎం సుజాత పలువురు వివోఏలు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: