వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి మాట్లాడుతూ ఆయా శాఖలు అందజేస్తున్న కార్యక్రమాలని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా అమలు చేస్తూ శాఖ పరమైన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, ఏడి మార్కెటింగ్ వరలక్ష్మి, ఐ సి డి ఎస్ పి డి పద్మ సునంద, మైన్స్ అండ్ జియాలజీ అధికారి రామచందర్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాసరావు, మరియు డిఎం మార్క్ఫెడ్, పిడి హౌసింగ్ తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: