దర్శి : మాజీ రాష్ట్రపతి, భారతరత్న, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని బుధవారం దర్శి తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరి గింది . కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ టి.దేవప్రసాద్, శాసన పరిశోధకులు తురిమెళ్ల శ్రీనివాస ప్రసాద శర్మ, జీవీ రత్నం, అట్లూరి రామారావు పాల్గొని ప్రసంగించారు.పేదరికం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగి అంతరిక్ష ప్రయోగాలతో భారత కీర్తిని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి కలాం అని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ పాలకురాలు విజయలక్ష్మి, తెనాలి రవిబాబు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: