శ్రీ భవానీ దేవి అలంకారంలో భక్తులకు అమ్మ దర్శనం.

బేగంపేట అక్టోబర్ 15,(జే ఎస్ డీ ఎం న్యూస్ )
దసరా నవరాత్రులలో బాగంగా ఐదవ రోజు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీ భవాని దేవి అలంకారములో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. గురు వారం నిత్య చండీహోమం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఈవో వంగ అంబుజ ఆధ్వర్యంలో పటిష్టమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయం వెలుపల ఆలయం లోపల రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. గురువారం శ్రీ భవాని దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
హోమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *