బేగంపేట అక్టోబర్ 15,(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ ) :
అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయన గురువారం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహంకాళి ఆలయం లో దేవీ నవరాత్రుల సందర్భంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాంగోపాల్ పేట డివిజన్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పండితులు ఎమ్మెల్యే కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం భవాని మాత అలంకారం ని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే వెంట ఆలయ EO అంబుజ, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, కోటేశ్వర్ గౌడ్, రాంమోహన్ యాదవ్, ఆంజనేయులు, టీనా గౌడ్, గణేష్, సత్యనారాయణ, అరుణ్ భట్ తదితరులు ఉన్నారు.
అమీర్ పేట డివిజన్..
దేవీ నవరాత్రుల సందర్భంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అమీర్ పేట డివిజన్ లోని పలు
ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ముందుగా కుమ్మరి బస్తీ లోని హనుమాన్ దేవాలయంలో బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో
ని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తదనంతరం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పండితులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం గాయత్రీ దేవి అలంకారంలో ని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, EO లు వినోద్ రెడ్డి, అంబుజ, జయంతి, చైర్మన్ లు సత్యనారాయణ యాదవ్, మల్లిఖార్జున్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, దాడి ప్రవీణ్ రెడ్డి, మధు, శ్రీనివాస్ గౌడ్, బాబా, వేణు గౌడ్, కూతురు నర్సింహ, ఆకుల రాజు, గుడిగే శ్రీనివాస్ యాదవ్, కట్టా బలరాం, గోపీలాల్ చౌహన్, వనం శ్రీనివాస్, హరిసింగ్, బాసా లక్ష్మీ, దుర్గ, రాణికౌర్ తదితరులు ఉన్నారు.
కట్ట మైసమ్మ ఆలయం.
దేవీ నవరాత్రుల సందర్భంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం బేగంపేట లోని కట్ట మైసమ్మ అమ్మవారి ని దర్శించుకుని పూజలునిర్వహించారు. అనంతరం శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారిఅలంకారంలోని అమ్మవారిని దర్శించుకుని పూజలునిర్వహించారు. పూజల అనంతరం తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ టి. మహేశ్వరి, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు టి. శ్రీహరి, నరేందర్, శేఖర్, ఆరీఫ్, రాగా నాగరాజుగౌడ్ , ఆలయ చైర్మన్ సుభాష్ తదితరులు ఉన్నారు.






Save or share this story as a newspaper-style Epaper Clip: