పురపాలక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలి – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి రాజాబాబు

పురపాలక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి రాజాబాబు కోరారు . మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై ఈ ఆర్ ఓలు, ఏ ఈ ఆర్ ఓ లకు మొదటి దశ శిక్షణా కార్యక్రమం గురువారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
    ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని కలెక్టర్ చెప్పారు. ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నామినేషన్ ప్రక్రియలో ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లు విధులు, వారంతా నిర్వహించాల్సిన విధివిధానాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నారు. ఇందు కొరకు ఆర్ఓ హ్యాండ్ బుక్ ను పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మున్సిపాలిటీలలో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల్లోగా నామినేషన్ల స్వీకరణ చేపట్టాలన్నారు. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలన్నారు. 21వ తేదీన అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాలన్నారు. ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓల నిబద్ధతతో పనిచేయాల్సి ఉందని అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. ముఖ్యంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు సమయపాలన ఉండాలని స్పష్టం చేశారు.

మున్సిపల్ ఎన్నికల విధి నిర్వహణలో అత్యంత పారదర్శకత పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. తప్పులు, పొరపాట్లు చేయకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. ఎవరికి ఎలాంటి మనహాయింపులు ఉండవని, తప్పులు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసే వరకు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. ఆర్ఓ కార్యాలయాల వివరాలు ముందుగానే సంబంధిత వార్డులలోని ప్రజలకు ప్రకటన చేయాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ అమలు కొరకు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈఆర్ఓల వద్ద ముఖ్యంగా ఓటర్ల జాబితా ఉండాలని, విధుల నిర్వహణపై చెక్ లిస్ట్ పరిశీలించుకోవాలని సూచించారు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లు ప్రత్యేక దృష్టి సారించాలని బిసి కార్పొరేషన్ ఈడీ, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ఇన్చార్జి అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని సూచించారు. నామినేషన్ ప్రక్రియ నిర్వహణపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. నామినేషన్ ప్రక్రియ ముందు, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన విధులపై శిక్షణ ఇచ్చారు. నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ, అభ్యర్థుల అర్హత వంటి పలు అంశాలపై క్షుణ్ణంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఆర్డీవో టి.చంద్రశేఖర్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *