నాగులుప్పలపాడు అక్టోబర్ 15, నాగులుప్పలపాడు : మండలంలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది ఒక్కసారిగా ఎంపీటీసీ సభ్యులు, గ్రామపంచాయతీ సర్పంచి, వార్డ్ సభ్యుల రిజర్వేషన్ ఖరారు అవ్వడంతో గ్రామాల్లో రాజకీయ వేడి ప్రారంభమైంది.టీడీపీఅధికార ,ప్రతిపక్ష పార్టీలతో పాటుగా కూటమి పార్టీలోని జనసేన, బిజెపి పార్టీలు ఎవరికి వారు కూడాతాము బరిలో నిలబడేందుకు కసరత్తులు ప్రారంభించారు ఈపాటికి మండల పరిషత్ అధ్యక్షులు ఎస్సీ జనరల్ అవ్వటం దీనికి తోడు జడ్పిటిసి ఓసి జనరల్ అవడంతో ఆశావాహులు రాజకీయ పార్టీ నేతల వద్దకు బారులు తీరారు. మునిపెన్నడూ లేనివిధంగా నాగులుప్పలపాడు మండలంలో రాజకీయంగా ఒక్కసారిగా గ్రామ గ్రామాన రాజకీయ కోలాహలం నెలకొంది. రిజర్వేషన్లు కూడా తేలిపోవడంతో అభ్యర్థుల ఎంపిక కొరకు కసరత్తులు ప్రారంభించారు. గెలుపోవటములపై కూడికలు తీసివేతలు చేస్తున్నారు. మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీలు కాగా, 12పంచాయతీలు జనరల్ అయ్యాయి 8 పంచాయతీలు ఎస్సీ రిజర్వ్ అయ్యాయి, బీసీలకు 2, ఎస్టీలకు1 సర్పంచులు రిజర్వ్ అయ్యాయి వీటిలో 50% మహిళలకు అన్ని కేటగిరిలో రిజర్వు అయ్యాయి తెలుగుదేశం అధికార పార్టీ శాసనసభ్యులు ఇంటికి నాగులుప్పలపాడు నేతలు క్యూ కట్టారు. మండలంలో జనసేన పార్టీ, బిజెపి పార్టీలు వారి వారి దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని కూటమి పార్టీ నేతలకు తమ ప్రతిపాదనను వారి ముందు ఉంచారు. రెండు రోజుల్లో నాగులుప్పలపాడు మండలంలో రాజకీయంగా ఎంపీటీసీలు, సర్పంచులు అభ్యర్థుల ఎంపికపై పరిశీలన కొరకు కమిటీ ప్రత్యేకంగా ఒకటి కమిటీ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం
Save or share this story as a newspaper-style Epaper Clip: