తాళ్లూరుః మండల కేంద్రంలో ఎన్నికల కోడ్ ఇంకా కూసినట్లు లేదు. మండల ప్రజా పరిషత్ గేటు వద్ద ఉన్న మాజీ సీఎం ఎన్ టి రామారావు, బొడ్డు రాయి వద్ద ఇతర ప్రాంతాలలో ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ముసుగులు తొడగలేదు. అదే విధంగా ఆయా ప్రాంతాలలో ఉన్న ఇరు పార్టీలకు చెందిన ప్లెక్సీలకు కూడ తొలగించలేదు. దీంతో తాళ్లూరు లో ఇంకా ఎన్నికల కోడ్ కూయలేదా అని గ్రామకార్యదర్శి వెంకట్రాది ని వివరణ కోరగా సాయంత్రం లోపు మొత్తం తొలగిస్తామని వివరణ ఇచ్చారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: