తాళ్లూరు : స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పక పాటించాలని డీఎల్పీఓ, మండల ప్రత్యేక అధికారి ఆర్ పద్మ కోరారు. తాళ్లూరు ఎంపీడీఓకార్యాలయంలో శు క్రవారం గ్రామ ప్రత్యేక అధికారులతో ఎంపీడీఓ అజిత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మండలంలో ఆయా గ్రామాలలో ఎన్నికల ప్రవర్తన నియమావళిలో బాగంగా రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలకు మునుగులు వెయ్యాలని, ప్లెక్సీలు తొలగించాలని చెప్పారు. ఏ పార్టీ లేదా అభ్యర్థి కూలాలు, మతాలు, బాషల మధ్య ద్వేషాలు లేదా విభేదాలు రేచ్చగొట్టెలా వ్యవహరించకూడదని అటువంటి విషయాలను పబ్లిక్కు తెలియజెయ్యాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి అవసరమైన ముందస్తు చర్యలను సూచించాలని కోరారు. ఎన్ జీ ఎన్ డబ్ల్యు అధికారి శ్రీనివాస రావు, కార్యాలయ పర్యవేక్షకులు గోపాల క్రిష్ణ, ఎంఈఓ జి నుబ్బయ్య, ఎపీఓ వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శి వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: