దర్శి : వైసీపీ పార్టీ మరోమారు విధేయతకు పట్టం కట్టింది. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు, పార్టీలకు అండగా ఉన్న వెన్నపూస వెంకట రెడ్డిని, దర్శి మున్సిపాలిటీ వైసీపీ అభ్యర్థిగా నిర్ణయించామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మొదటి నుండి పార్టీ లో ఉండి వీరవిధేయుడిగా ఉన్న వెన్నపూస వెంకట రెడ్డి (మహేష్)ను నిర్ణయించామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా పోలీస్ స్టేషన్ ల చుట్టూ, తహసీల్దార్ ఇతర కార్యాలయాలకు వెళ్లి సమస్యలను పరిష్కరించే వారని అన్నారు. మహేష్ లో వైఎస్ జగనన్నను చూసుకుని ప్రతి కార్యకర్త మున్సిపల్ ఎన్నికలు మొదటి సారిగా నేరుగా జరుగుతున్నందున ప్రతి కార్యకర్త , ప్రజలు మహేష్ బలపరచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో ఎఎంసీ చైర్మన్ గా చేసిన అనుభవంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకుని పోయే వ్యక్తి కాబట్టి ఆయనను గెలిపించుకుని దర్శి మున్సిపాలిటీ అభివద్దికి మహేష్ ను ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయనను తను, అమ్మ వెంకాయమ్మ అండగా ఉండి ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: