దర్శి టిడిపి కార్యాలయం లో దర్శి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబందించి… దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తో ప్రకాశం జిల్లా ఎన్నికల పరిశీలకులు
శాసనమండలి సభ్యులు (MLC)భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు .
- మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రజాబలం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలని ఈ సందర్భంగా రాంభూపాల్ రెడ్డి సూచించారు. వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు కూడా దొరకడం లేదని జనరంజక పాలనలో ప్రజలందరూ కూటమికి ఏకపక్షంగా మద్దతిస్తున్నారన్నారు.
- ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం ఖాయమని ప్రజాదరణ కనిపిస్తుందని ఆమె తెలిపారు.
ఈ సమావేశం లో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ఉన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: