బేగంపేట అక్టోబర్ 17(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ )
దేవీ నవరాత్రులను పురస్కరించుకుని శనివారం సాయంత్రం మాజీ ఎన్ డి ఎం ఏ వైస్ చైర్మన్ బిజెపి జాతీయ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శశిధర్ రెడ్డికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి, రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ డివిజన్ అధ్యక్షులు సందీప్ వర్మ, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు వి. దయానంద్ రావు, ఆకుల ప్రతాప్, రమేష్, ఎన్. చంద్రపాల్ రెడ్డి, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు గుంటిసత్యనారాయణ, ఇతర నాయకులు శ్రవణ్, సూర్యవంశీ తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: