శ్రీ మహాలక్ష్మి నల్ల పోచమ్మ అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలి…..అమ్మవారి ఆలయాన్ని దర్శించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్ గిరి సీ పీ సుమతి.సీ పీ ని కలిసి కృతఙ్ఞతలు తెలిపినవంశీ నిస్వారత్ సేవా అపార్ట్మెంట్ వాసులు.

బేగంపేట అక్టోబర్ 17,(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ )
బేగంపేట మయూరి మయూరి మార్క్ అల్లం తోట బాయిలోని శ్రీ మహాలక్ష్మి నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని మల్కాజ్గిరి సీపీ బడుగుల సుమతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ చైర్మన్ గౌర పల్లి లక్ష్మణ్,గౌరపల్లి రమేష్ లు సీ పీ ని షాలువాలతో ఘనంగా సత్కరించారు. పూజలు నిర్వహింపజేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణం లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సిపి సుమతి పాల్గొని భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మీ నల్ల పోచమ్మ దేవి అమ్మవారు
ప్రజలందరినీ చల్లగా చూడాలనీ, ఆయురారోగ్యాలు సుఖశాంతులు అందించాలని ఆకాంక్షించారు. తాను దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని సిపి తెలియజేశారు.
అమ్మవారి ఆలయాన్ని దర్శించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్ గిరి సీ పీ సుమతి ని
వంశీ నిస్వారత్ సేవా అపార్ట్మెంట్ వాసులు కలిసి కృతఙ్ఞతలు తెలియజేసారు.ఈ పూజ లో గౌరపల్లి లక్ష్మణ్,గౌడపల్లి రమేష్, నిస్వాత్ సేవా వంశీ అపార్ట్మెంట్ వాసులు హరీష్ బొతారా, అమిత్ నాహత, దిలీప్ కర్నాని, వినోద్ బొతారా, వినీత్ కేం కా, మధు మహేశ్వరి, ఓం ప్రకాష్ జకోతియా, సంజయ్ కేషన్, దినేష్ వ్యాస్, సూరజ్,తులసి రామ్ కరాడియా, సుదీప్ సేన్ గుప్తా, అజయ్ జున్ జున్ వాలా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *