బేగంపేట నవంబర్ 7 (జెఎస్ డీ ఎం న్యూస్ ) :
నేటి విద్యార్థులే రేపటి పర్యావరణ పరిరక్షకులు అని, దీన్ని దృష్టిలో ఉంచుకుని
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా వాటిని సంరక్షించాలి అని
ఇండో-కెనడియన్ న్యాయవాది, వేకప్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు
సయ్యద్ నూర్ పిలుపు నిచ్చారు.
శనివారం ప్రకాశం నగర్ లోని మన్సూరా సైబర్ హైస్కూల్‌లో ఘనంగా పర్యావరణ వేడుకలు నిర్వహించారు.పాఠశాల కరస్పాండెంట్, న్యాయవాది మొహమ్మద్ ముదస్సిర్ జుహా ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ వేడుకలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన పెంచే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్శులకు వంద మొక్కలను పంపిణీ చేశారు.ఈ వేడుకలకు ఇండో-కెనడియన్ న్యాయవాది, వేకప్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు అడ్వకేట్ సయ్యద్ నూర్, వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ ఆర్గనైజేషన్ (WEO) వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సి.హెచ్. భద్ర, జాతీయ చైర్‌పర్సన్ డాక్టర్ ఎ. జ్యోత్స్న, అడ్వకేట్ జి. లలిత్ కుమార్, డబ్ల్యూఈవో సభ్యులు ఆర్. లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సయ్యద్ నూర్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పర్యావరణ పరిరక్షకులని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ అడ్వకేట్ మొహమ్మద్ ముదస్సిర్ జుహా, ప్రిన్సిపాల్ ఎం. సుష్మ, మొహమ్మద్ ముజమ్మిల్ జుహా మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. 1935 నుంచి విద్యాసేవలో కొనసాగుతున్న తమ పాఠశాల సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపా డి భావితరాలకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడంలో ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.







Save or share this story as a newspaper-style Epaper Clip: