తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్

హైదరాబాద్, నవంబర్ 12(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో నంబర్ 1654 విడుదల చేసింది. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కీలక బదిలీలు ఇవే..హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా మహేష్ మురళీధర్ భగవత్ (1995 బ్యాచ్) నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీ (ఎల్ అండ్ ఓ) గా ఉన్న ఆయన వీసీ సజ్జనార్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
డీజీపీ, మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసాగా డా. సౌమ్య మిశ్రా (1994) నియమితులయ్యారప్రస్తుతం జైళ్ల శాఖ డీజీగా ఉన్న ఆమెకు డీజీపీ (ఆర్గనైజేషన్), డీజీపీ (లీగల్) అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా (1995)* నియమితులయ్యారు ప్రస్తుతం డీజీపీ (ఆర్గనైజేషన్) గా ఉన్న ఆమెకు డీజీపీ, హోంగార్డ్స్ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.
ఏసీబీ డీజీగా చారు సిన్హా (1996)* నియమితులయ్యారుప్రస్తుతం డీజీపీ, సీఐడీగా ఉన్న ఆమెకు డీజీపీ, సీఐడీ అదనపు బాధ్యతలు కూడాకొనసాగనున్నాయి.టీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ & ఎండీగా డా. అనిల్ కుమార్ (1996) నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీ (ఆపరేషన్స్), గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ గా ఉన్నారు. ఆయన వై. నాగిరెడ్డి స్థానంలో బాధ్యతలు తీసుకోనున్నారు.
ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ & సివిల్ డిఫెన్స్ డీజీగా వీసీ సజ్జనార్ (1996) నియమితులయ్యారు ఆయనకు డీజీ, ఎస్పీఎఫ్ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.సివిల్ సప్లైస్ కమిషనర్ & ఈవో ప్రిన్సిపల్ సెక్రటరీగా వై. నాగిరెడ్డి (1997)* నియమితులయ్యారు.ఆయనకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీసీ & ఎండీ, కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.డీజీపీ (ఆపరేషన్స్), గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ గా విక్రమ్ సింగ్ మాన్ (1998) నియమితులయ్యారు ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.టీజీ-టీఎంఏఆర్ఎస్ డైరెక్టర్ గా ఎం. స్టీఫెన్ రవీంద్ర (1999) నియమితులయ్యారఏడీజీపీ (ఎల్ అండ్ ఓ) గా అకున్ సభర్వాల్ (2001) నియమితులయ్యారుఆయనకు ఏడీజీపీ, కోఆర్డినేషన్, ఏడీజీపీ, టెక్నికల్ సర్వీసెస్ (టీ-స్పార్క్) అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.ఏసీబీ డైరెక్టర్ గా ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (2004) నియమితులయ్యారుఐజీ, మల్టీ జోన్-1 గా కార్తికేయ (2006)* నియమితులయ్యారు ఆయనకు డైరెక్టర్, ఐసీసీసీ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.ఐజీ, రైల్వేస్ గా కే. రమేష్ నాయుడు (2006) నియమితులయ్యారుజాయింట్ డైరెక్టర్, రోడ్ సేఫ్టీ & జాయింట్ డైరెక్టర్, ట్రాఫిక్, టీజీ-టీఎంఏఆర్ఎస్ గా డి. జోయల్ డేవిస్ (2010) నియమితులయ్యారఆయనకు హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ, ట్రాఫిక్ అదనపు బాధ్యతలు కొనసాగనున్నాయి.డీఐజీ, జోన్-7, జోగులాంబ అదనపు బాధ్యతలు జి. చందన దీప్తి (2012) కు అప్పగించారు.
ఇతర అధికారులకు కూడా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *