శభాష్.. చంద్ర..! -బీటెక్ చదువుతూ… బరువులు ఎత్తుతూ…. పవర్ లిఫ్టింగ్ లో సత్తా చాటుతున్నప్రకాశం జిల్లా యువకుడు

ఆ యువకుడి పేరు… గుంటి శక్తిధర శ్రీచంద్ర. పేరులోనే కాదు… దేహంలోనూ బలమైన శక్తి ఉంది. అధిక బరువులను అవలీలగా ఎత్తుతూ పవర్ లిఫ్టింగులో ఛాంపియనుగా సత్తా చాటుతున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తూ పతకాలను కైవసం చేసుకుంటున్నాడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే వివిధ టోర్నీలలో తన ప్రదర్శనతో ప్రకాశం జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నాడు. విశేష ప్రతిభతో రాణిస్తున్న చంద్రను జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ప్రత్యేకంగా అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బాల్యం నుంచే శక్తి… ఆసక్తి!

        శక్తిధర శ్రీచంద్ర ప్రస్తుతం ఒంగోలు శివారులోని పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పవర్ లిఫ్టింగ్ చేయడంలో చిన్ననాటి నుంచే ఆసక్తి చూపేవాడు. అతని తల్లిదండ్రులు గుంటి భక్తధృవుడు ( హోంగార్డ్ ), జ్యోతి ( అడ్వకేట్ ). శ్రీచంద్ర .. పెద్ద కుమారుడు కాగా, చిన్న కుమారుడు నితిన్ చంద్ర ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్నాడు. శ్రీచంద్ర శక్తిని, ఆసక్తిని గమనించిన తండ్రి భక్తదృవుడు తగిన శిక్షణ అందించారు. ఈ  నేపథ్యంలో ఇటు పవర్ లిఫ్టింగ్ లోనూ, అటు చదువులోనూ రాణిస్తూ శ్రీచంద్ర తనదైన ముద్రను వేస్తున్నారు. 

వారి వంశంలోనే ‘ పవర్ ‘

        శ్రీచంద్ర తాత గుంటి చంద్రశేఖర్. 1959లో ఈయన ఒంగోలులో భారత జాతీయ వ్యాయామ కళాశాల ప్రారంభించారు. తండ్రి సమక్షంలో పవర్ లిఫ్టింగులో శిక్షణ పొందారు భక్తదృవుడు, ఆయన సోదరి రాజరాజేశ్వరి. ప్రస్తుతం భక్తదృవుడు జాతీయస్థాయిలో పవర్ లిఫ్టింగ్ రిఫరీగా ఉన్నారు. ఈయన వద్ద శిక్షణ పొందిన వందలాదిమంది కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వంలో క్రీడా కోటాలో ఉద్యోగాలు పొందారు. ఆయన సోదరి కూడా పవర్ లిఫ్టింగులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి 

ప్రస్తుతం జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా ఉన్నారు. భక్తదృవుడు తాత గుంటి పాపయ్య స్వాతంత్ర్య పోరాటయోధులు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో సబర్మతి జైలులో శిక్షను అనుభవించారు. ఈ నేపథ్యంలో భక్తధృవుడు నాయనమ్మ కనకవల్లికి ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ కూడా లభించింది. తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వారి దీవెనలతో తన బిడ్డ పవర్ లిఫ్టింగులో కామన్ వెల్త్, వరల్డ్ ఛాంపియనుగా ఎదిగేలా అడుగులు వేస్తున్నట్లు భక్తదృవుడు తెలిపారు.

ఇవీ చంద్రకు వచ్చిన మెడల్స్..!

*. 2023 మే నెలలో తెనాలిలో జరిగిన క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో గోల్డ్ మెడల్.
*. 2024 మార్చిలో చిల్లకల్లులో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో గోల్డ్ మెడల్.
*. 2024 మే నెలలో మంగళగిరిలో జరిగిన ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగులో గోల్డ్ మెడల్.
*. 2024 డిసెంబరులో కృష్ణలంకలో జరిగిన పవర్ లిఫ్టింగులో గోల్డ్ మెడల్.
*. 2025 ఏప్రిల్ లో గుడివాడలో జరిగిన క్లాసిక్ పవర్ లిఫ్టింగులో గోల్డ్ మెడల్.
*. 2025 మే, జూన్ నెలలలో ఒంగోలులో జరిగిన ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ పోటీలలో గోల్డ్ మెడల్.
*. 2026 మార్చిలో బెంగళూరులో జరిగిన దక్షిణ భారత పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకం.
*. 2026 ఏప్రిల్ లో విజయనగరంలో జరిగిన క్లాసిక్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్.
*. 2026 మేలో జగ్గయ్యపేటలో జరిగిన ఎక్విప్డ్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్.
*. 2026 జూన్ లో హైదరాబాద్ లో జరిగిన నేషనల్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకం.
*. 2026 అక్టోబర్, నవంబర్ లో కేరళలో జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *