12వ PRC కమిషన్‌కు అదనపు సిబ్బంది నియామకం – మరో ముందడుగు!

12వ వేతన సవరణ సంఘం (12th PRC) కమిషనర్ కార్యాలయంలో పరిపాలనా పనుల సౌలభ్యం కోసం రిటైర్డ్ అసిస్టెంట్ సెక్రటరీలైన శ్రీ PBVSS శివకుమార్ గారిని కమిషనర్‌కు ప్రైవేట్ సెక్రటరీగా, శ్రీ B. వెంకటేశ్వరరావు గారిని PRC కార్యదర్శికి పర్సనల్ అసిస్టెంట్‌గా ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం G.O.Rt.No.3153, Finance Department, తేదీ 12.11.2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ నియామకాలతో PRC కార్యాలయ పనితీరుకు కొంత మేర అదనపు బలం చేకూరనుంది. ఇదే విధంగా PRC కార్యాలయానికి అవసరమైన ఇతర సిబ్బందిని కూడా ప్రభుత్వం త్వరితగతిన సమకూర్చినట్లయితే, కమిషన్‌కు అవసరమైన పరిపాలనా సహకారం మరింత మెరుగుపడి, నిర్ణీత గడువులోగా PRC నివేదికను సమర్పించేందుకు మార్గం సుగమం అవుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.

PRC నివేదిక సకాలంలో రావాలని, ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియ త్వరితగతిన ముందుకు సాగాలని ఆశిద్దాం!

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *