రోడ్డు భద్రతా రాయబారులుగా మారండి – ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, ప్రాణాలను కాపాడండి….. తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు.రోడ్డు భద్రతా రాయబారులుగా మారండి – ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, ప్రాణాలను కాపాడండి….. తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు.

బేగంపేట నవంబర్ 18,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
రోడ్డు భద్రతా రాయబారులుగా మారండి – ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, ప్రాణాలను కాపాడండి అని తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు పిలుపు నిచ్చారు.
తిరుమల గిరి సెయింట్ జోసెఫ్ పాఠశాల లో “ARRIVE ALIVE” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ట్రాఫిక్ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేసారు.మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఆదేశాల మేరకు, డీసీపీ ట్రాఫిక్-I కె. రాహుల్ రెడ్డి, పర్యవేక్షణలో, ట్రాఫిక్ తిరుమలగిరి డివిజన్ ఏసీపీ జి. శంకర్ రాజు ఆధ్వర్యంలో బుధవారం తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ జి. శంకర్ రాజు మాట్లాడుతూ విద్యార్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యత మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
గురించి వివరించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించడం, కార్లలో సీట్ బెల్ట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రోడ్డు సూచికలను పాటించడం, జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడం, పాదచారుల భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు.అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం మరియు ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. చిన్న వయస్సు నుంచే రోడ్డు భద్రతా అలవాట్లను పెంపొందించుకోవాలని, తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రోత్సహించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, విద్యార్థుల్లో నిరంతరం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం మరియు వారిని రోడ్డు భద్రతా రాయబారులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా సెయింట్ జోసెఫ్ పాఠశాలలో “TRAFFIC SAFETY CLUB – ARRIVE ALIVE” ను ఏర్పాటు చేశారు.ఈ క్లబ్ ద్వారా విద్యార్థులు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, తమ తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు మరియు సమాజంలోని ఇతరులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ మైఖేల్ డిసౌజా మరియు పాఠశాల యాజమాన్యం తరఫున బ్రిగెట్ పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వారు అభినందించి, విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తమ సహకారాన్ని అందిస్తామని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *