బేగంపేట నవంబర్ 18,(జే ఎస్ డీ ఎం న్యూస్ )
అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన రాంగోపాల్ పేట డివిజన్ లోని ఖండోజీ బజార్ లో పర్యటించారు. SS ఫ్లోరింగ్ కోసం రోడ్డును త్రవ్వి వదిలేయడం వలన తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని బస్తీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రాత్రివేళల్లో క్రిందపడి పలువురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బస్తీలో శానిటేషన్ నిర్వహణ కూడా సక్రమంగా లేదని ఎమ్మెల్యే కు స్థానికులు విన్నవించారు. బస్తీలో ఉన్న చెత్తను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే పిర్యాదులపై సకాలంలో స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట వాటర్ వర్క్స్ DGM వెంకట్ రెడ్డి, శానిటేషన్ అధికారి సదానంద్, హార్టికల్చర్ అధికారి రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లికార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కె.కిషోర్ కుమార్, రాంమోహన్ యాదవ్, చంద్ర ప్రకాష్, టి. శ్రీహరి, కొండాపురం మహేష్ యాదవ్, ఆనంద్ పాటిల్, బస్తీ వాసులు శివ విష్ణు, శ్రీనాధ్, విశ్వేశ్వర్ రావు, అనిల్ గౌడ్, నవీన్, చేతన్, మాణిక్, దుర్గ దాస్, కిరణ్ గౌడ్, అరవింద్, శ్రీకాంత్, రాజీవ్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు .





Save or share this story as a newspaper-style Epaper Clip: