తాళ్లూరు: తాళ్లూరు జెడ్పీటీసీగా కైపు నాగలక్ష్మి శుక్రవారం ఒంగోలు లో ప్రమాణ స్వీకారం చేసారు. మండలంలో 13.276 అత్యధిక మెజార్టీ తో విజయం సాధించిన ఎకైన టిడిపి జెడ్పీటీసీగా చరిత్ర సృష్టించారు. ఆమె భర్త కైష్ణను రామకోటి రెడ్డి తెలుగు మండల తెలుగు రైతు అధ్యక్షుడిగా పనిచేస్తూ చిరకాలంగా పార్టీ అభ్యన్నతికి చేసిన కృషి ఫలించి ఆమె జెడ్పీటీసీ అయిందని తెలుగు దేశం పార్టీ అభిమానులు చర్చించుకుంటున్నారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జెడ్పీటీసీ కైపు రామకోటి రెడ్డి నాగలక్ష్మిలకు బంధు మిత్రులు అభినందనలు చెప్పారు. తమకు అవకాశం కల్పించిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ల కు జెడ్పీటీసీ కైపు రామకోటిరెడ్డి నాగలక్ష్మిలు కృతజ్ఞతలు చెప్పారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: